అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మహిళలకు ప్రాధాన్యత
మోమిన్ పేట జూలై 14 జనం సాక్షి: వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మొరంగపల్లి రాళ్లగుడిపల్లి గ్రామాల్లోని బోనాల పండుగ అంగరంగవైభవంగా శుక్రవారం నిర్వహించడం జరిగిందని ఎంపీపీ డి వసంత వెంకట్ మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య తెలిపారు. బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి, కుండపైన ఓ దీపంతో మహిళలు నెత్తిన పెట్టుకుని.. పోతురాజులు, మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి.. బోనం కుండలను అనగా తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేసి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవత అయిన మైసమ్మకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించిన అనంతరం తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి వెంకట్ మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య దళిత రత్న అవార్డు గ్రహీత బుచ్చయ్య మోమిన్ పేట మొరంగపల్లి గ్రామ సర్పంచులు ఏ శ్రీనివాసు రెడ్డి ఎం శ్రీనివాస్ రెడ్డి లఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసం అమ్మవారికి తొట్టెలు సమర్పించారు బోనాలను సమర్పిస్తే అమ్మవారు శాంతించి అంటువ్యాధులు రాకుండా దీవిస్తారని భక్తుల నమ్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో , జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాణయ్య గణేష్ నర్సింలు ఆశి రెడ్డి బసవరాజ్ మాజీ ఎంపిటిసి ప్రభాకర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ డి లక్ష్మయ్య కాంగ్రెస్ బి ఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.