అంగరంగ వైభవంగా సవిూకృత కార్యాలయాలకు పునాదులు
ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు
హైదారాబాద్,అక్టోబర్12(జనంసాక్షి): ఒకవైపు ఉత్సాహం.. మరోవైపు ఉద్వేగం.. కలగలిసిన క్షణాన..పది
జిల్లాల తెలంగాణ.. 31 జిల్లాల నవ తెలంగాణగా ఆవిర్భవించి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో మరో విప్లవాత్మక నిర్ణయంతో తెలంగాణ సిఎం కెసిఆర్ ముందుకు సాగారు. ఏకంగా ఒకేరోజు అన్ని కొత్త జిల్లాల సవిూకృత ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు పునాది వేయడమే గాకుండా ,అనేక చోట్ల మంత్రులతో వేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాల ఆవిష్కరణోత్సవం గతవిజయదశిమి రోజు ఘనంగా జరిగింది. 31 జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. జిల్లాల ప్రారంభోత్సవ సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో మొదలుకొని ప్రజల్లో ఆనందం వెల్లివిరిసినట్లుగానే ఇప్పుడు కూడా అలాంటి ఉద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ నేడు మరో 21 కొత్త జిల్లాలతో 31 జిల్లాలుగా ఆవిర్భవించింది. ఆ జిల్లాలలన్నీ వచ్చే ఏడాదికల్లా కొత్త కార్యాల యాల్లోకి అడుగు పెట్టేలా జిల్లాకు 5ఏకోట్ల నిధులను విడుదల చేసి సవిూకృత కార్యాలయాలకు పునాది వేశారు. సిద్ధిపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టినట్లుగానే సవిూకృత కార్యాలయాలకు పునాది కూడా పడింది. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు పునాదులు పడ్డాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. నిధులు విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమంలో అనేకచోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో సిఎం కెసిఆర్ చేతుల విూదుగ ఆపునాది పడితే జనగామలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జయశంకర్ భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, జగిత్యాలలో ఆటెల రాజేందర్, యాదాద్రిలో మంత్రి జగదీవ్ర్ రెడ్డి , కామారెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కుమ్రం భీమ్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, మేడ్చల్‌లో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా అంతటా కార్యాలయాలకు పునాదులు పడ్డాయి. వచ్చేయేడుకల్లా ఇవి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ చరిత్ర సృష్టించిందని,పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టించగా ఇప్పడుఉ కార్యాలయాల నిర్మాణంతో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని దిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి చారిత్రక ఘటన జరిగి ఉండదన్నారు. దసరా పర్వదినం రోజు ఏకంగా 21 కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే ఏడాది తిరిగే కల్లా కార్యాలయాలకు పునాది వేయడం కేవలం సిఎం కెసిఆర్‌కే సాధ్యమయ్యిందన్నారు. శాస్త్రీయంగా, చట్టబద్దంగా ప్రజల అభిప్రాయం మేరకు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని వేణుగోపాలాచారి అన్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలుగడంతో పాటు ప్రతి పైసా అర్హులైన లబ్దిదారులకు చేరుతుందన్నారు. రాజకీయాలకు తావులేకుండా కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేయడం సహజమేనని అందువల్ల వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం వాటిని ప్రజలకు చేరువ చేయడం అధికారులపై ఉందన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమితి వ్యవస్థకు రద్ధుచేసి మండలాల ఏర్పాటు జరిగిందని, అప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలో మండలాల ఏర్పాటును విమర్శించారన్నారు. మండలాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందాయన్నారు. చిన్న జిల్లాలతో అధికారులు ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు దేనిని కూడా జీర్ణించుకోరని, ఇప్పుడు కార్యాలయాల నిర్మాణాన్ని విమర్శించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చిన్న జిల్లాలతో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. పరిపాలనా సౌలభ్యానికే ముఖ్యమంత్రి సవిూకృత భవనాల
నిర్మాణానికి రూపకల్పన చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. 1987లో మండల వ్యవస్థ ఏర్పాటు కావడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగి ప్రభుత్వ ఉద్యోగులతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆ దిశగానే సీఎం తెలంగాణ రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గతేడాదిగా చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన పాలన అందు తోందన్నారు. జిల్లాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆదర్శ జిల్లాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త సంస్కరణలు అమలు చేస్తామని, అవినీతిరహితి పాలనను అందిస్తామని తెలిపారు.