అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
శ్రీకాకుళం, జూన్ 27 : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పారిశుద్య లోపం, కలుషిత నీరు వల్ల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అతిసార, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు నుంచి లేదా పంచాయతీ సాధారణ నిధుల నుంచి నిబంధనల మేరకు తీర్మానం పొంది కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుని అవసరం మేరకు ఉపయోగించాలని, గ్రామాల్లోని కాలువల్లోని పూడికను తీయించాలని, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తోడించాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు.