అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్

కామారెడ్డి ప్రతినిధి జూన్15(జనంసాక్షి);
అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్ లో భాగంగా మంగళవారం  తేది:14-06-2022 న కర్ణాటక లోని బీదర్ జిల్లా యస్.పి. కార్యాలయంలో మూడు ( కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ) రాష్ట్రాలకు చెందిన బార్డర్ జిల్లా యస్.పి.లు రివ్యూ మీటింగ్ నిర్వహించారు .ఈ మీటింగ్ ముఖ్య ఉద్ద్యేశం.సరిహద్దులు జిల్లా పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండి నేరాలఅదుపునకు కృషిచేయడం. డి.యస్.పి, సి.ఐ,  యస్.ఐ లు బార్డర్ పోలిస్ స్టేషన్ లతో సత్సంబంధాలు కలిగి పరస్పరం సమాచారం  అందించుకోవలన్నారు.మిస్సింగ్ కేసుల, గుర్తు తెలియని మృతదేహాల సమాచారం అనగా లుక్ ఔట్ నోటీస్ లను బార్డర్ పోలీస్ స్టేషన్ లకు ఇవ్వడం వలన మిస్సింగ్ కేసుల చేదన సులభతరం అవుతుంది అన్నారు.అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల  సమాచారం పరస్పర బదిలీ చేయడం ద్వారా కేసులను త్వరితగతిన చేదించగలమన్నారు. వీ.ఐ.పీ లకు ఎస్కార్ట్, పైలేటింగ్ విషయమై సమాచారం బార్డర్ పోలీస్ స్టేషన్ లకు అందించుకొని పరస్పరం సహకారం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేదించబడిన గుట్కా, గంజాయి
ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి ట్రాన్స్-పోర్ట్ అవుతున్న సమాచారం బార్డర్ పోలీస్ స్టేషన్ లకు ఇవ్వడం ద్వారా కేసులను అరికట్టవచ్చును అన్నారు. యన్ బిడబ్యు,ఇక్కడ నేరం చేసి, ఇతర రాష్ట్రాలలో తల దాచుకున్న నేరస్తుల విషయమై పరస్పరం సహకారం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీదర్ జిల్లా యస్.పి. కిషోర్ బాబు, కామారెడ్డి జిల్లా యస్.పి. శ్రీనివాస్ రెడ్డి, డి.యస్.పి.లు కలగుర్గి, లాతుర్, నాందేడ్,  నారాయణఖేడ్ డిఎస్పీ  శ్రీ రామ్, జహీరాబాద్ డిఎస్పీ రఘు, జహీరాబాద్ సి.ఐ భూపతి, నారాయణఖేడ్ సి.ఐ రామకృష్ణ రెడ్డి, యస్.బి. ఇన్-స్పెక్టర్ మహేష్ గౌడ్, డి.సి.ఆర్.బి.  ఇన్-స్పెక్టర్ జెలెందర్ రెడ్డి మరియు మూడు రాష్ట్రాలకు చెందిన బార్డర్ పోలీస్ స్టేషన్ యస్. ఐ. లు  తదితరులు పాల్గొన్నారు.