అందరి బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం

` కుల వృత్తితో పాటు విద్య ఇతర రంగాల్లో రాణించాలి
` గొర్రెలు పెంచడం .. మేకలు కాయడం తప్పు కాదు
` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి (జనంసాక్షి):అందరి బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిరదని గొర్రెల పెంచడం .. మేకలు కాయడం తప్పు కాదని . శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు కాశారని.. ఆయన కన్నా మనం గొప్ప వాళ్లం కాదని.. మనను ఏడుసార్లు ఏలిన నిజాం మనవడు కూడా ఆస్ట్రేలియాలో 10 వేల ఎకరాల్లో గొర్రెల పెంపకం వ్యాపకంగా స్వీకరించాడని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి బీఆర్‌ఎస్‌ భవన్‌లో నిర్వహించిన యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ‘‘ కుల వృత్తితో పాటు విద్య ఇతర రంగాల్లో రాణించాలి.రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాల్లో దాదాపు 50 శాతం భూమి యాదవ సోదరుల చేతుల్లో ఉంది.గతంలో యాదవులకు భూములు ఉండేది కాదు .. కాలక్రమంలో భూములు వారి చేతుల్లోకి వచ్చాయి.రానున్న రోజుల్లో తెలంగాణలో యాదవ సోదరులు కీలకపాత్ర పోషిస్తారు. నా వద్ద  90 గొర్రెలు, పొట్టేళ్లు, బెంగాల్‌ మేకలు ఉన్నాయి జీవాలను పెంచడం నాకు ఆసక్తి.ఆపత్కాలంలో, ఆకలికాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి.ప్రజలందరూ ఉన్నతంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నది.జనరల్‌ స్థానం అయిన వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గా బీసీ,  ఉద్యమకారుడు అయిన గట్టు యాదవ్‌ను చైర్మన్‌ గా చేసుకున్నాం.వనపర్తిలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి సొంతంగా రూ.10 లక్షల విరాళం అందిస్తాను. అందరి సహకారంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకుందాం.యాదవ భవనం నిర్మాణానికి ఎకరా స్థలం అందించేందుకు కృషి చేస్తాను. రూ.2.50 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరిస్తాను.అందులో గ్రంథాలయం, కంప్యూటర్‌ రూమ్‌ ఏర్పాటు చేద్దాం యాదవ బిడ్డలు గొప్పగా ఎదిగేందుకు ఆ భవనం బాటలు వేయాలి’’ అని అన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ , గొర్రెలు మేకల పెంపకం దారుల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్‌, బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు వంగూరు ప్రమోద్‌ రెడ్డి, ప్రకాష్‌ , బీఆర్‌ఎస్‌ నేతలు రాములు యాదవ్‌ తదితరులు