అందరి మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకోవడం లయన్స్ గంధ ని ప్రత్యేకత
*షఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రోయ్యురి సురేష్ సహకారంతో నిత్యావసర సరుకులు, ఎనర్జీ డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ
తూప్రాన్ (జనం సాక్షి), సెప్టెంబర్, 19.
అందరి మధ్యన పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా జరిపించుకోవడం లయన్స్ నేతగా ఎదిగడమే అని చార్టెడ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ పల్లేర్ల బాలేష్ గుప్త అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ 320 డి గవర్నర్ లయన్ గందాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ పల్లేర్ల బాలేశ్ గుప్త మాట్లాడుతూ పుట్టిన రోజు ను జన్మదినం అని ఇంగ్లీషులో బర్త్ డే అని అంటారనీవివరించారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే గవర్నర్ లయన్ గంధానీ శ్రీనివాస్ కు తూప్రాన్ లయన్స్ క్లబ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గందాని ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నమని అన్నారు.
ఈ పుట్టిన రోజున తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేకును కోసి తోటి వారికి పంచడం జరిగిందని తెలిపారు. గవర్నర్ లయన్ గందానీ శ్రీనివాస్ పుట్టిన రోజు నాడు విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, వృద్ధాశ్రమంలో ని వృద్దులకు, కార్మికులకు మిఠాయిలు పంచి, వారందరితో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించారు. ఆనంతరం డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ అన్ని దానములలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అని అన్నారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినా రాదని తెలిపారు. అందుకే వెనుకటి రోజుల్లో, పేదలకు, అన్నార్థులకు అన్నదానం చేశారు . అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టం అయినది అన్నదాన మహిమ ఎంతో గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ స్కూల్ యాక్టివిటస్ లయన్ నీల ప్రవీణ్ కుమార్ గుప్త, తూప్రాన్ లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ పల్లేర్ల బాలేశ్ గుప్త, ట్రెజరర్ డెకరేషన్ వెంకటేష్, శ్రీరాం నాగరాజు గుప్త, కొండూరి సాయిరాం గుప్త, కొండూరి శ్రవణ్ గుప్త, చంది శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.