అందరి సహకారంతో అభివృద్ధి
సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 15
మండల ప్రాదేశిక సభ్యుల సహాయ, సహకారాలతో ఎంపీపీగా శంకరపట్నం మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నానని, శంకరపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమ్మెoతల సరోజన అన్నారు గురువారం ఎంపీపీ చాంబర్ లో ఎంపీటీసీలతో అభివృద్ధి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సరోజన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మండలంలోని అన్ని గ్రామాలకు క్షేత్రస్థాయిలో, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని, మండలములోని అన్ని గ్రామాల ఎంపిటిసిల సహాయ, సహకారాలతో మండలాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకెళుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, కోఆప్షన్ సభ్యులు కాజా పాషా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసిలు మోయిన్, తిరుపతి, సంపత్, కవిత కోటిలింగం, భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి,, అంతం లతా రాజిరెడ్డి, వరలక్ష్మి సంపత్, ఇన్చార్జి ఎంపీడీవో కాజాబషరోద్దిన్, కార్యాలయం సూపర్ ఇండెంట్ శ్రీధర్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు