అందరూ ఎర్రవల్లిలా ఇళ్లు కావాలంటున్నారు
సంగారెడ్డి,మార్చి31(జనంసాక్షి): సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లు పేదలకు వరమని జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు సత్యనారాయణరెడ్డి అన్నారు. ఇవి దేశానికే నమూనాగా మారనున్నాయని అన్నారు. ఈ మోడల్‌లో జిల్లా అంతటా నిర్మించాలన్న డిమాండ్ వస్తోందన్నారు. అయితే ప్రబుత్వం పేదలకు గూడు కల్పించేందుకు చిత్తశుద్దితో కృషిచేస్తోందని అన్నారు. ఎర్రవల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండుపడక గదుల ఇళ్లు పేదల జీవితాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపనున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణం పూర్తయిన రెండు ఇళ్లతో పాటు, జల సంరక్షణ పనులను పరిశీలించారు. ఇదిలావుంటే అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను గతంకంటే మిన్నగా, భారీఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మన్నెగోపాల్ కోరారు.గతం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఉత్సవాలకు అధిక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. సంబంధిత శాఖ అధికారులు మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకోకుండా చూడాలన్నారు.