అంబేద్కర్ జాతీయ అవార్డుకు కొరిమి వెంకటస్వామి ఎంపిక
*శంకరపట్నం, జనం సాక్షి, మార్చ్ 10,
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,దళిత సంఘ నాయకుడు కొరిమి వెంకటస్వామి బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు శుక్రవారం ఎంపికయ్యారు. తిరుపతిలో ఈనెల 12వ తేదీన నిర్వహించే బహుజన రైటర్స్ ఆరవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లో అవార్డు అందుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ కారుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా, దళిత ఉద్దారకుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుల వివక్ష రహితంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తికి ఆ మహోన్నత వ్యక్తి అవార్డు రావడం సంతోషకరమని దళిత జిల్లా, నియోజకవర్గ, గ్రామ దళిత సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు