అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమంవైపు.అడుగులు.
విద్వేష రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఐటి మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల హితారక రామారావు.
తెలంగాణ గడ్డకు పోరాటాలు కొత్త కాదు.
అన్నదమ్ముల కలిసున్న ప్రజల్లో విద్వేషాల చిచ్చు.
జిల్లాలో పక్ష యాభై వేల కుటుంబాలు లక్ష 20 వేల పెన్షన్లు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు.
వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగం.
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 16. (జనం సాక్షి). భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పూర్తి పేరు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తుంటే కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఐటి మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటి మున్సిపల్ భారీ పర్సనల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డకు పోరాటాలు కొత్త కాదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనంతరం జరిగిన పోరాటాలను ప్రస్తావించారు 1948లో విలీన తర్వాత 1952 54, 1968 పోరాటాలను గుర్తు చేశారు 370 మంది ఆ పోరాటానికి ప్రాణాలు దారబోసారని అన్నారు బలవంతపు విలీనం వల్ల తెలంగాణ వెనుకబాటు గురైందని తెలిపారు
2001 ఒకరి నుండి 14 వరకు కేసీఆర్ నేత్యత్వంలో జరిగిన పోరాటం ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామని అన్నారు. కని విని ఎరుగని రీతిలో దేశంలోనే 8 ఏళ్ల కాలంలో కెసిఆర్ పట్టుదల ముందు చూపుతో అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉన్నామని తెలిపారు. ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడం కోసం కొత్తగా గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, జిల్లాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రం లో ఇప్పటికే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల జేఎన్టీయూ తో పాటు మెడికల్ కళాశాల కూడా రానుందని అన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి బుడ్డ పైసా కూడా తీసుకురాలేని నాయకులు అన్నదమ్ముల కలిసున్నా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సిరిసిల్లలో అపెరల్ పార్క్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ఎన్ని లేఖలు రాసిన సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. సమైక్యతతో అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొటట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం తప్ప సంక్షేమం పట్ల పట్టింపు లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా తెలంగాణకు ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఎన్ని వంద కోట్ల నిధులు ఇచ్చారో చెప్పాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం తో పాటు తెలంగాణ విలీనం కోసం రాష్ట్రం కోసం ప్రాణాలు దారబోసిన అమరవీరుల స్ఫూర్తిగా సమైక్యతను విచ్ఛిన్నం కానివ్వమని ఉద్వేగ భరితంగా అన్నారు. జిల్లాలో 1,లక్ష,50,వేల కుటుంబాలు ఉంటే లక్ష ఇరవై వేల పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు ఎక్కడైనా ఎవరైనా రాకపోయి ఉంటే వారందరికీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేలా చూస్తామని తెలిపారు. నూతనంగా జిల్లాలో 17వేల పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు లబ్ధిదారులకు లంచంగా పెన్షన్లు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ లు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, ఎస్పీ రాహుల్ హెడ్డే, అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, సత్య ప్రసాద్ ప్రజా ప్రతినిధులు నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు