అకాల వర్షం కారణంగా ప్రధాన రహదారులు, డ్రైనేజీలను పరిశీలించిన

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- గద్వాల్ పట్టణంలోని గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం కురిసిన కారణంగా పలు ఏరియాలు ప్రాంతాలు మరియు మురికి కాలువలు నిండి రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో పట్టణ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇట్టి విషయాన్ని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మరియు  మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ద్వారా తెలుసుకొన్ని వెంటనే తదితర ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి అదేవిదంగా రాజీవ్ మార్గ్ లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు పరిశీలించడం జరిగింది..ఎమ్మెల్యే మాట్లాడుతూ..
అకాల వర్షము కారణంగా గద్వాల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులతో పాటు పర్యటించి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పట్టణ ప్రజలకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎవరు అధైర్య పడవద్దని అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు మేము ఎప్పుడు మీ ముందు ఉంటామని గద్వాల్ ఎమ్మెల్యే అన్నారు. అదేవిదంగా మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు,అధికారులు సహాయక చర్యలు అందించేందుకు ఎప్పుడు సిద్దంగా ఉందని తెలిపారు.లో తట్టు ప్రాంతాల ప్రజలకు గద్వాల్ ఎమ్మెల్యే గారు ధైర్యం చెప్పారు.అలాగే జరుగుతున్న డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచించారు. భవిష్యత్తులో పునర్వసం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ నరహరి గౌడ్,  తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయి శ్యామ్ రెడ్డి,ధర్మ నాయుడు, మున్సిపల్ అధికారులు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.