*అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి*

నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో  సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు పరీక్ష రాయు సందర్భంలో పాటించవలసిన నియమ, నిబంధనల విషయమై కలెక్టర్ పలు సూచనలను చేశారు.
జిల్లాలో మొత్తం 52  పరీక్షా కేంద్రాల్లో 16084  మంది పరీక్షకు హాజరుకానున్నారని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్  18004251442  కు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
హాల్ టికెట్ లను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోని వారు https://www.tspsc.gov.in/ వెబ్సైట్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని, బయో మెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8-30  గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని,  10-15 ల తర్వాత పరీక్షా కేంద్రంలో అనుమతి ఉండదని తెలిపారు
హాల్ టికెట్ తో పాటు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్, ప్రభుత్వ గుర్తింపు కార్డ్(పాన్ కార్డు ,ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ,డ్రైవింగ్  లైసెన్స్ పాస్ పోర్ట్….) తీసుకొని రావాలని సూచించారు.
హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా ప్రింట్ కాని అభ్యర్థులు గెజిటెడ్ అధికారితో నిర్ణీత ప్రోఫార్మలో ధృవీకరించి 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు.
పరీక్ష కేంద్రంలో రైటింగ్ ప్యాడ్ లు, మొబైల్ ఫోన్, క్యాలుకులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లకు అనుమతి ఉండదని, అభ్యర్థులు తీసుకొని రాకుండా ఉండాలని, పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి, షూ ధరించి రావద్దనీ సూచించారు.
అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్,  ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్ లెట్ నెంబర్, వెన్యూ కోడ్ సరిగ్గా పరీక్షించుకోవాలని,  తప్పులు ఉంటే ఓఎం ఆర్ షిట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు.
ఓ ఎం ఆర్   జవాబు పత్రంపై వైటనర్/చాక్ పవర్/బ్లేడ్/ఎరేజర్ ఉపయోగించడం నిషేధమని, పరీక్ష పూర్తయ్య వరకు అభ్యర్థులెవరు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరని సూచించారు.

Attachments area