అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు వరంగల్ కోర్టు ఆదేశం
వరంగల్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది వరంగల్ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. దీంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు కాజీపేట పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్‌ను నిర్మల్ పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.