అక్బరుద్దీన్‌ కేసు విచారణ 4కు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ కేసు విచారణను ఎక్సైజ్‌ ప్రత్యేక న్యాయమూర్తి కె.మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు. 2005లో రోడ్డు వెడల్పు విషయంలో అడ్డువచ్చిన ప్రార్థనామందిరాన్ని తొలగించే విషయంలో ఎంఐఎం నాయకులు అప్పటి కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ షింఘాల్‌పై దాడి సంఘటన కేసులో మొదటి ముద్దాయి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండవ ముద్దాయి అక్బరుద్దీన్‌ ఓవైసీ తరఫు న్యాయవాది రఘునందన్‌ శుక్రవారంనాడు ఆయన బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ విచారణను న్యాయమూర్తి మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు.