అక్బరుద్దీన్ కేసు 8కి వాయిదా
సంగారెడ్డి, జనవరి 28 (): 2005 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్ కేసు విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ పస్ట్‌క్లాస్ మ్యాజిస్ట్రేట్ మారుతిదేవి వాయిదా వేసినట్టు అక్బరుద్దీన్ న్యాయవాది రఘునందన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు నుంచి ఆయనను సంగారెడ్డి కోర్టుకు పోలీసులు తరలించారు. తన అన్నతో మాట్లాడేందుకు కోర్టు 1 గంట అక్బరుద్దీన్‌ను సమయం కేటాయించింది. ఆ సయమంలో పార్టీ విషయాలు, తమ కుటుంబ విషయాలను చర్చింనట్లు రఘునందన్ చెప్పారు. సంగారెడ్డి కోర్టులో విచారణ సమయంలో యాకుత్‌పూర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్, చార్మి ఎమ్మెల్యే బాషా ఖాద్రీ, కార్వాన్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, బహదూర్‌పుర ఎమ్మెల్యే మోంజన్‌ఖాన్‌లు హాజరయ్యారు. కోర్టు ముందు స్థాని ఎంఐఎం నేతలు, ముస్లిం యువకులు అక్బరుద్దీన్ కేసు విచారణ వినేందుకు అధిక సంఖ్యలో కోర్టుకు వచ్చారు. విచారణ అనంతరం అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్ జైల్‌కు తరలిస్తుండగా ఆయన అభిమానాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడిషనల్ ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు.