అక్బరుద్దీన్‌ పిటిషన్‌ కొట్టివేసిన నిర్మల్‌ కోర్టు

ఆదిలాబాద్‌: తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన వైద్యం కోసం చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను నిర్మల్‌ కోర్టు కొట్టివేసింది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అక్బరుద్దీన్‌ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలన్న నిర్మల్‌ పోలీసుల పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. పోలీసుల పిటిషన్‌పై రేపు కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం అక్బరుద్దీన్‌ని ఆదేశించింది.