అక్బర్ నగర్, చిక్కడపల్లి గ్రామాల్లో స్వతంత్ర వజ్రోత్సవ సంబురాలు

రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్  మండల  కేంద్రంలో స్వతంత్ర  వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత 2,3 రోజుల నుండి ఆయా గ్రామాల సర్పంచ్ లు , మండల నాయకులు, మండల ప్రజలకు   జాతీయ జెండాలను పంపిణీ చేస్తూ ప్రజలలో దేశ భక్తిని పెంచుతున్నారు. ఈ కోవలోనే అక్బర్ నగర్ సర్పంచ్ గంగామణి వరప్రసాద్, మరియు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ పుష్పలత రమేష్  వారి వారి గ్రామస్తులకు జాతీయ జెండాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎందరో మహనీయుల త్యాగఫలంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి గ్రామనికి చెందిన ఉపసర్పంచ్ నరేందర్, గుడుసే పోషట్టి, నాగ్ నాథ్, సెక్రెటరీ రాధిక, అశోక్, సాయిలు  అక్బర్ నగర్ గ్రామానికి చెందిన  గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.