అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగలు స్వాదీనం

నెల్లూరు, జూలై 28 : దట్టిలి మండలం దేవునిపల్లి అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న 3లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుండలను అటవీశాఖాధికారులు శనివారం తెల్లవారు జామున పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా దేవుని పల్లి గ్రామం వద్ద అటవీశాఖా అధికారులకు ఎర్రచందనం రవాణా చేస్తున్న వ్యాను కంటబడింది. దానిని అధికారులు వెంబడించడంతో గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వెంకటగిరి డిపోకు తరలించినట్లు అధికారులు తెలిపారు.