అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత*

-పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి.
గద్వాల ఆర్ సి.(జనం సాక్షి) ఆగస్ట్ 18
 గద్వాల పట్టణంలోని పిలిగుండ్ల కాలనీలో నివాసం ఉంటున్న సలావుద్దీన్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 90 ప్యాకెట్ల రేషన్ బియ్యం బుధవారం పోలీసులు పట్టుకున్నారు.అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు నమ్మదగిన సమాచారం రాగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది , గద్వాల టౌన్ పోలీస్ సిబ్బంది తనిఖీ నిర్వహించి 90 సంచుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు , అందాజ  40 క్వింటాళ్లు ఉన్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పట్టణ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.