అక్రమమైనింగ్‌పై ఉక్కుపాదం

4

– ఇసుకరిచ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌,ఆగస్టు 1(జనంసాక్షి): ఇసుక రీచ్‌ల్లో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని కొత్తపల్లి వద్ద ప్రభుత్వ ఇసుక క్వారీలో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు.  జిల్లాలో అక్రమ మైనింగ్‌ వార్తలపై కేటీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇసుక అక్రమాలను అరికట్టాలని రెండు, మూడు రోజుల క్రితమే అధికారులను మంత్రి ఆదేశించారు.మెయిన్‌రోడ్డు నుంచి 12 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్‌ను మంత్రి పరిశీలించారు. మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లా యంత్రాంగానికి, టీఎస్‌ఎండీసీకి సమాచారం ఇవ్వకుండానే మంత్రి కేటీఆర్‌ తనిఖీలు చేశారు. అక్కడి కూలీలు, డ్రైవర్లతో మైనింగ్‌ తీరుపై ఆరా తీశారు. ఎస్పీ జోయల్‌ డెవిస్‌, ఆర్డీవోతో కేటీఆర్‌ మాట్లాడారు.  మోయతుమ్మెదవాగులో జరుగుతున్న మైనింగ్‌ను మంత్రి పరిశీలించారు. జిల్లా యంత్రాంగం, టీఎస్‌ఎండీసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి తనిఖీలకు వెళ్లారు. కూలీలు, డ్రైవర్లతో మంత్రి మాటామంతీ జరిపారు. మైనింగ్‌ జరుగుతున్న తీరుతో పాటు ఇసుక ఎటు వెళ్తుందో కూడా మంత్రి ఆరా తీశారు. జిల్లా ఎస్పీ జోయల్‌ డేవిస్‌, ఆర్డీవోతో కేటీఆర్‌ మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలకు మంత్రి ఆదేశించారు.  చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక రవాణాపై చర్యలకు ఆదేశించారు. రాష్ట్రంలోని ఇతర మైనింగ్‌ ప్రదేశాల్లోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మైనింగ్‌ జాతీయ సంపద, అక్రమాలు జరగనీయొద్దని కేటీఆర్‌ అధికారులతో అన్నారు. కొత్తపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన డంప్‌ సైట్లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.