అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టండి.

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలి.
పట్టణంలో వీధి కుక్కల బెడదను తొలగించండి.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం.
24వ వార్డ్ కౌన్సిలర్ సాహూ శ్రీలత లక్ష్మీకాంత్.
తాండూరు సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
అక్రమంగా తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు కొనసాగిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని 24 వ వార్డు కౌన్సిలర్ సాహూ శ్రీలత లక్ష్మి కాంత్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా
కలెక్టరేట్లో ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. .ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ సాహూ శ్రీలత లక్ష్మికాంత్ మాట్లాడుతూ తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో ఓ వ్యక్తి అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్నారని గత ఆరు మాసాల నుండి మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని తెలిపారు. అయినప్పటికిని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా తాండూరులో రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్రమైందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు ,మహిళా మోర్చా నాయకులు తదితరులు ఉన్నారు.