అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్..
వివరాలు తెలియజేసిన ఎస్ఐ కోగిల తిరుపతి
కేసముద్రం-ఆగస్టు 9- జనం సాక్షి : బుధవారం మండలంలోని కల్వల గ్రామంలో ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో అనుమానస్పదంగా కనిపించిన అశోక్ లేలాండ్ వాహనంను తనిఖీ చేయగా అందులో 2,85,000/- విలువ గల 28 క్వింటాళ్ల 58 బస్తాల నల్లబెల్లం,50కేజీ పటికను పట్టుకొని అక్రమ రవాణా చేస్తున్న ఎండి అమీర్,మునికుంట్ల నరేష్,ఎండి అజారుద్దీన్ ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకొని విచారించాగా బీదర్ నుండి అక్రమంగా నల్లబెల్లం తెచ్చి కేసముద్రం చుట్టుపక్కల విక్రయిస్తున్నామని తెలిపారు.నల్ల బెల్లం,పటిక,అశోక్ లేయలాండ్ వాహనంను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.