అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి
అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు. అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని, దాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని తెలిపారు. అబ్బాయి చదివితే వారికి మాత్రమే ఉపయోగపడుతుందని, అమ్మాయి చదువు కుటుంబానికి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారిస్తుందని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాదించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, శైలాజానాథ్ పాల్గొన్నారు.