అఖండ భారతం పటేల్‌తోనే సాధ్యమైంది

1

– వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సభలో మోదీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జనంసాక్షి):

భారత్‌ను అఖండ దేశంగా మలచిన ఘనత  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన కృషిని జాతి ఎప్పటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పటేల్‌ రాజకీయ కౌశలం ఎంతో గొప్పదని కొనియాడిన ప్రధాని చాణక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్‌కే దక్కుతుందన్నారు. దేశ విభజన శక్తులను పటేల్‌ ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భారతావని ఆయన సేవలను సదా స్మరించుకుంటుందన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 140వ జయంతి వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. పటేల్‌ స్మారక స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… పటేల్‌ జీవన విధానం, సిద్దాంతాలు సదా ఆచరణీయమని పేర్కొన్నారు. ఆయనను తలచుకుంటేనే ఆయన చిత్రపటం మన కళ్లముందు కదలాడుతుందని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం… అహ్మదాబాద్‌ మున్సిపాల్టీలో అప్పట్లోనే మహిళల కోటా 50శాతం ఉండేలా పటేల్‌ కృషి చేశారని గుర్తు చేశారు. పటేల్‌ అహ్మదాబాద్‌లో 222 రోజులపాటు స్వచ్ఛ అభియాన్‌ నిర్వహించారు… అప్పటి నుంచే స్వచ్ఛత కార్యక్రమాలకు ముందడుగు పడిందన్నారు. పటేల్‌ స్ఫూర్తితో ఐక్య భారత్‌, శ్రేష్ఠ భారత్‌ సాధన దిశగా కలిసికట్టుగా నడవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశమంతా ఐక్యంగా ఉండడమే భారత్‌కు అతిపెద్ద శక్తి అవుతుందన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు పటేల్‌ చేసిన కృషిని భారత జాతి ఎప్పటికి మరిచిపోదన్నారు.  దేశం బలంగా, సాధికారికంగా నిలబడిందంటే సర్ధార్‌ సంకల్పమే కారణమన్నారు. స్వచ్ఛతపై పటేల్‌కు ఉన్న సంకల్పాన్ని చూసి గాంధీ అభినందించారన్నారు. సర్దార్‌ పటేల్‌ దేశ విభజన శక్తులను ధీటుగా ఎదుర్కొన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు పటేల్‌ చేసిన కృషి జాతి మరిచిపోదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ 140వ జయంతి సందర్భంగా శనివారం పటేల్‌ స్మారకస్పూపం వద్ద మోదీ నివాళులర్పించారు. రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన యూనిటీ రన్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ తదితరులు పాల్గొన్నారు. యూనిటీ రన్‌లో పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

పటేల్‌కు దక్కని గౌరవం: వెంకయ్య

చరిత్రలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు తగిన గుర్తింపు దక్కలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పటేల్‌ ప్రధాని అయివుంటే దేశ ప్రగతి మరోలా ఉండేదని అభిప్రయాపడ్డారు. పటేల్‌ సేవలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని వెంకయ్య మండిపడ్డారు. అవినీతిలో కూకుని పోయిన నేతలు దేశాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. పటేల్‌ ఎంతో త్యాగం చేసి దేశాన్‌ఇన ఒక్కటి చేస్తే కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదన్నారు. ఇంతకన్నా దారుణం లేదన్నారు. ఆయన విషయంఓల అన్యాయమే జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు.