అఖిలపక్షంపై నేతల ఆగ్రహం
ఒకపార్టీ ఒకే వైఖరి చెప్పాలి :కేటీఆర్
హైదరాబాద్: అఖిలపక్షానికి హాజరయ్యే పార్టీలున్ని ఒకే వైఖరి ప్రకటించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు,వైఎస్ విజయలక్ష్మి, బొత్ససత్యనారాయణ స్వయంగా హాజరై తమ పార్టీల వైఖరి స్పష్టం చేయాలన్నారు. బూటకపు మాటలతోతెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం మానుకునిపార్టీల వైఖరి ఒకటే ఉంటే విధంగా స్పష్టం చేయకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహంతో పాదయాత్రలు పరుగుయాత్రలవుతాయని ఆయన హెచ్చరించారు.
ఎందరు వెళ్లినా ఒకే మాట చెప్పాలి: హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌పార్టీ అఖిలపక్షంపేరుతో మరోసారి మోసం చేసిందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అధికారపార్టీ మోసం చేసినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత విపక్షాలపై ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, లోక్‌సత్తా , ఎంఐఎం పార్టీలు అఖిలపక్షానికి ఎంతమందిని పంపినా ఒకే అభిప్రాయం చెప్పి ప్రజాప్రతినిధులుగా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకులమా, వ్యతిరేకమా ఏదో ఒకటి చెబితే తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను ఎత్తుకోవాల్నో, తెలంగాణ నుంచి ఎత్తేయాల్లో నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు.
కేంద్రం ఇద్దరిని పిలవడం సరికాదు :యాదవరెడ్డి, భానుప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైన హోంమంత్రి మరోసారి అలోచించాలని వారు కోరారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని ఈ విషయమై కలుస్తామని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
ఒకే అభిప్రాయం చెప్పాలని లేకుంటా ఆపార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ హెచ్చరించారు. సమావేశంలో రెండు అభిప్రాయలు చెప్పిన పార్టీలను తెలంగాణ ప్రాంతం నుంచి తరిమికొట్టే విధంగా ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు.
ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణపై టీడీపీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌పార్టీఅఖిలపక్షంపేరుతో ఇద్దరిని పిలువడంతోకొత్తనాటకాలనికి తెరలేపిందని ఆయన విమర్శించారు.పార్టీలో నిర్ణయం తీసుకుని అఖిలపక్షంలో పార్టీ అభిప్రాయాన్ని చెబుతామని ఆయన పేర్కోన్నారు.
‘కాంగ్రెస్ టీడీపీలకు నియంతలకు పట్టిన గతే:నాగం
హైదరాబాద్: తెలంగాణకు మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు నియంతలకు పట్టిన గతే పడుతుందనినగార సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అఖిలపక్ష సమావేశంలో ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ వ్యక్తంచేశారు.
ఎందరైన వెళ్లాండి ఒకే మాట చెప్పండి : కోదండరాం
హైదరాబాద్: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుండి ఎందరు వెళ్లిన ఒకే అభిప్రాయం చెప్పాలని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. ఈ నెల 28నఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి వెళుతున్న పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పేల ఆపార్టీల్లోని తెలంగాణనేతలు బాధ్యత తీసుకోవాలని కోదండరాం సూచించారు.
కాంగ్రెస్ సహ ఒకే మాట చెప్పాలి: వివేక్
హైదరాబాద్: తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో సహ అన్ని పార్టీలు ఒకే అభిప్రాయాన్ని చెప్పాలని టీ కాంగ్రెస్ ఎంపీ వివేక్ అన్నారు. ఈ నెల 2న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా డొంక తిరుగుడు వ్యవహారలతో తెలంగాణ ప్రజల జీవతాలతో అడుకోవద్దని ఆయన హెచ్చరించారు.
అఖిల పక్షంతో తెలంగాణ రాదు:కోమటిరెడ్డి
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశంతోతెలంగాణ రాదని కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రుల సయవంచన వల్లనే కేంద్రం అఖిలపక్షం వేసి మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రులు జనారెడ్డి , ఇతర మంత్రుల మాటలు మోసపు మాటలని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.