అఖిల కు రూ. 10,000 ఆర్థిక సాయం చేసిన ఆకుల సదయ్య

జనం సాక్షి కథనానికి స్పందన…

మంథని, ఫిబ్రవరి 13, ( జనం సాక్షి ): పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థులు అఖిల దాతల సహాయం కోసం ఆశగా ఎదురు చూపు అనే శీర్షికతో జనంసాక్షి లో ఆదివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన అర్చన ఫర్టిలైజర్స్ ఆకుల సదయ్య పది వేల రూపాయలు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. వైద్య విద్య అభ్యసించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేద్దామని ఎంతో ఆకాంక్ష ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనలేక అయోమయం లో ఉన్న మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లాలోని సూరారం మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో సీటు సొంతం చేసుకున్నా.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం పంచాయతీ పరిధిలోని రాజాపూర్ అనే గ్రామానికి చెందిన అవునూరి అఖిల దీన గాథను జనంసాక్షి వెలుగులోకి లోకి తీసుకు రావడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టిన తాను చదువు కొనే స్తోమత లేని విషయం తెలుసుకొని తన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుని వార్త గా ప్రచురించిన జనం సాక్షి పత్రిక కథనానికి స్పందించి తన వంతు సాయంగా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఆకుల సదయ్య కు అఖిల, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.