అగ్నిపథ్ ను రద్దు చేయాలి* *కాల్పుల్లో చనిపోయిన కుటుంబానికి కేంద్రం పరిహారం చెల్లించాలి*
దేశ రక్షణ విషయంలో బిజెపి నాయకులు దేశభక్తి బట్టబయలైంది అని దేశ రక్షణ నిమిత్తం ప్రైవేటీకరణను పూనుకోవడం సిగ్గుచేటని
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు ప్రకటించటం సరైనది కాదు అని అగ్నిపథ్ ను పూర్తిగా రద్దు చేయాలని జడ్చర్ల నియోజకవర్గ తెరాస యూత్ వింగ్ నాయకులు డిమాండ్ చేశారు జడ్చర్లలో నియోజకవర్గ లోని జడ్చర్ల మిడ్జిల్ బాలానగర్ రాజాపూర్ నవపేట్ మండలాల తెరాస యూత్ వింగ్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేవలం నాలుగు ఏళ్ళు మాత్రమే ఉంచుకొని తర్వాత ఇంటికి పంపించి వారికి ఎలాంటి ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి దేశ యువత పట్ల ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైందన్నారు అగ్నిపథ్ ఒక కుట్ర అని, సైన్యంలో కూడా కాంట్రాక్ట్ పద్దతి తీసుకొచ్చి దేశాన్ని రక్షించే సైనికులను కూడా ప్రవేట్ పరం చేయటమే అన్నారు ఇప్పటికే అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేసినట్లే సైన్యాన్ని కూడా ప్రవేట్ పరం చేసే కుట్రలో బాగంగమ్మానారు . ఇప్పటికీ ఆర్మీ నియామకాలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత జీవితాలతో ఆటలడటం మానుకోవాలిని. సికింద్రాబాద్ లో జరిగిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. కాల్పులలో చనిపోయిన రాకేష్ కుట్టుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని.. ఈ ఆందోళనను కూడా రాజకీయం చేయటం మానుకొని అగ్ని పథ్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువతను తక్కువ అంచనా వేయొద్దు అని రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పే హక్కు ఉందని వారు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బాలనగర్ మండల యువత అధ్యక్షులు సుప్ప ప్రకాష్, జడ్చర్ల మండల యువత అధ్యక్షులు వీరేష్,రాజపూర్ మండల యువత అధ్యక్షులు బంగారి వెంకటేష్, మిడ్జిల్ మండల యువత అధ్యక్షులు పట్నం బంగారు,బాలనగర్ బిసి సెల్ అధ్యక్షులు బాలయ్య,శివ ముదిరాజ్,లక్ష్మి నర్సింలు,శ్రీను,తిరుపతి, మనితేజ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.