అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం
ఖమ్మం, జనంసాక్షి: వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో పది గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్నత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తోసుకొచ్చింది. బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. బాధితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. రూ.లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.