అగ్ని ప్రమాదం వల్ల రూ.లక్ష ఆస్తి నష్టం
పెద్దశంకరంపేట, జనంసాక్షి: మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం ఏర్పడింది. గ్రామానికి చెందిన భూపతి దత్తు కుటుంబం ఈరోజు ఉదయం వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన సమయంలో వారి ఇంట్లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.