అగ్ని-4 క్షిపణి విజయవంతం
భువనేశ్వర్,నవంబర్9(జనంసాక్షి):
అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని ఒడిశా లోని బాలాసోర్ నుంచి సోమవారం విజయవంతంగా ప్రయోగించారు. 4వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ా’ాదించగల అగ్ని-4ను సాధారణ పరీక్షల్లో భాగంగా సాయుధ దళ అధికారులు బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కాంప్లెక్స్ 4 నుంచి ప్రయోగించారు. అగ్ని-4 స్వదేశీ పరిజ్ఞానంతో అణ్వాయుధాలను ప్రయోగించే ఐదోతరం బాలిస్టిక్ క్షిపణిగా దీనిని అభివృద్ధి చేశారు. భూమిపై నుంచి భూమిపై లక్ష్యాలను అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి చేధించగలదు.
3వేల కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను చేధించగల అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, పృధ్వీ క్షిపణులు భారత అమ్ములపొదిలో ఉన్నాయి. తాజాగా అగ్ని-4 వచ్చి చేరడంతో భారత ఆయుధ సంపత్తి మరింత బలంగా మారింది.