అగ్నీపత్ స్కీమ్ ను రద్దుచేసే వరకు పోరాడుతాం-ఓయూ జేఏసీ.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
భారత రక్షణ రంగాన్ని
ప్రైవేట్ పరం చేస్తున్న అగ్నిపథ్ కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా ఓయూ జేఏసీ టీఎస్ జెేఎసి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓయూ జెేఏసి చైర్మెన్ మాందాల భాస్కర్, అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వ్యతిరేక పథకం రిజర్వేషన్లు లేకుండా నాలుగుసంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి యువకుల జీవితాలను నాశనం చేసే పథకం అని పేర్కొన్నారు,కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ అగ్నీపత్ ను వెంటనే రద్దు చేయాలని దేశంలోని రైతులను దేశంలోని ఆర్మీ జవాన్లు ఈ రెండు వర్గాలను బిజెపి ప్రభుత్వం హింసించే పథకాన్ని రద్దు చేయాలన్నారు,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం త్రివిధ దళాలను కూడా ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు,ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చి కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఆరెస్సెస్ తీసుకొచ్చిన పథకంగా భావిస్తున్నామన్నారు,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం హిందూ ముస్లిం ఎస్టీ ఎస్టీ లను విభజిస్తూ కాలం గడుపుతుందన్నారు,కాంగ్రెస్ పార్టీ దేవరకొండ సీనియర్ నాయకుడు డాక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ అగ్నిపథ్ ఉద్యమంలో అమరుడైన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కొరారు.
రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలు*
1.అగ్నిపథ్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలి
2.సికింద్రాబాద్ అల్లర్లలో పేద విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని.
3.పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4.సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన ప్రతి విద్యార్థికి ముప్పై లక్షల వైద్య సహాయం అందించాలి.
5.రాష్ట్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
6.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ కార్యాచరణ ప్రకటించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తున్నది.
7.దేశంలోని అన్ని వర్శిటీల విద్యార్థులతో త్వరలో ఢిల్లీ కేంద్రంగా భారీ ప్రదర్శన.
8.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించే వరకు అండగా ఉండి బెయిల్ ఇప్పించి విడుదల చేయాలి.
బిజెేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళ నుండి దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని చూశాం ఇప్పుడు దేశ అత్యున్నత రక్షణ రంగానికి కూడా ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే అగ్నిపత్ పేరుతో కొత్త కుట్రకు నాంది పలికారు,ఈ దేశాన్ని కంటికి రెప్పలా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా,కన్న తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులకంటే కూడా ఈ దేశమే ప్రాణం అని ముఖ్యమని భావించి విధుల్లో చేరే ఎంతోమంది యువతీ యువకుల ఆశలను,ఆశయాలను,పెట్టుబడి దారీ నరరూప రాక్షసులయిన అంబానీ,ఆదానీ లాంటి ఆర్థిక నేరగాళ్ల చేతుల్లో పెట్టడానికి జరుగుతున్న పెద్ద కుట్రగా ఓయూ జేఏసీ భావిస్తోంది.తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం,దేశ రక్షణలో తాత్కాలిక,ప్రయివేట్,కాంట్రాక్
Attachments area
|