అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం
– ఇద్దరి మృతి
ఫ్లోరిడా,జులై 25(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల ఘటనలతో ఉలిక్కిపడింది. ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్ మైర్స్‌లోని ఓ నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. మరో 17 మంది గాయాలపాలయ్యారు. క్లబ్ బ్లూలో ‘టీన్ నైట్’ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనంపైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. పోర్ట్ మేయర్స్ క్లబ్ బ్లూలో సాయుధుల టార్గెట్ చిన్నారులే అని తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో 13 నుంచి 15 ఏళ్ల లోపు వారి స్విమ్ సూట్ పార్టీ జరుగుతుండటంతో సాయుధుల టార్గెట్ చిన్నారులే అని తెలుస్తోంది. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాయుధుల్లో మరొకరు పరారైనట్లు తెలుస్తోంది. క్లబ్ పరిసరాల్లో మొత్తం మూడు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరే అన్ని చోట్లా కాల్పులకు పాల్పడ్డారా లేక ఎక్కువ మంది దుండగులు ఉన్నారా అనేది ఇంకా నిర్ధారించలేదు. తొలుత క్లబ్ వద్ద.. రెండోది, మూడోదీ సవిూపంలోని జంక్షన్‌లో చోటు చేసుకున్నాయి. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఓ నల్లటి ¬ండా ఎస్‌యూవీలో వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటన నుంచి కమేడియన్ సైరిటా గ్యారీ కుమార్తె క్షేమంగా బయటపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘భగవంతుడి దయవల్లే మా అమ్మాయి ఈ ఘటన నుంచి బయటపడింది. తన స్నేహితురాలి కాలిలో బుల్లెట్ దిగింది. వారంతా ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరి నేర మనస్తత్వం వల్ల పిల్లలు ఇలాంటి దారుణాలను ఎదుర్కొనవలసి రావడం ఘోరం..’ అని పేర్కొన్నారు. ఆదివారం టెక్సాస్‌లోని బేస్టోప్ర్ నగరంలో కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో మరోమారు అమెరికాలో రక్షణ చర్యలు పటిష్టం చేశారు.