అచ్చంపేటలో పెళ్లింట పెను విషాదం

పెళ్లయిన కాసేపటికే నవ వధువు మృతి

నాగర్‌కర్నూల్‌,జూలై7(జ‌నం సాక్షి): అచ్చంపేట మండలంలోని బుడగజంగల కాలనీలో విషాదం నెలకొంది. పెళ్లి అయిన కాసేపటికే నవ వధువు మృతి చెందింది. అరుంధతి నక్షత్రం చూస్తూ నవ వధువు బుజ్జి(23) కుప్పకూలిపోయింది. దీంతో హుటాహుటిన నవ వధువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బుజ్జి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నవ వధువు బుజ్జి మృతి చెందడంతో.. ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురు కుప్పకూలడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో పెళ్లింటో విషాదం అలముకుంది. పెళ్లయిన కాసేపటికే వధువు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వధువు మృతికి కారణాలు తెలియరాలేదు. వైద్యులు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాక తెలుస్తుందని అన్నారు.