అచ్చంపేటలో 100 పడకల కొత్త దవాఖాన ప్రారంభం కోసం ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ

డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 18 (జనం సాక్షి న్యూస్) ; స్థానిక పట్టణ కేంద్రంలోని నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులో తీసుకురావాలని డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ …నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనం ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న నేటికి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రారంభానికి నోచుకోలేదు అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు లో మంజూరైన ఆస్పత్రిలో ప్రధానమైన సమస్యలు సరిపడ పారామెడికల్ సిబ్బంది, వైద్య సామాగ్రి పరికరాలు, మందులు లేవనేది స్పష్టం అవుతోంది అన్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించి నూతన 100 పడకల ఆసుపత్రిని 15 రోజులలోపు ప్రారంభించి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇదే ఇదే క్రమంలో ధర్నా శిబిరం వద్ద పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతుండగా అడ్డుకొని కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుంటుండగా తీవ్రంగా ప్రతిఘటిం చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డౌన్ డౌన్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అని నినాదాలు ఇస్తూ.. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామనాథం ,హరిచంద్ర కాజా ,గౌరీ శంకర్, కటకం రఘురాం, గార్లపాటి శ్రీనివాసులు, దాశరధి పవన్ కుమార్ ,మల్లికార్జున్, కోరే రేణయ్య, మోటామరి రాజు, తగుళ్ళ అంజి యాదవ్, యూత్ కాంగ్రెస్ , ఎన్ ఎస్ యూ ఐ స్టూడెంట్ విభాగపు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.