అచ్చంపేట పట్టణంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 20( జనం సాక్షి న్యూస్ ): స్థానిక పట్టణంలోని చింతల్ బస్తి కాలనీలో ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, సొంత స్థలాలు ఉన్న పేదలకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ నాయకులు పేద ప్రజలతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు ఎస్ మల్లేష్ , నిర్మల మాట్లాడుతూ.. సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిన 1142 మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటం చేసి సాధించుకున్న ఇండ్ల స్థలాల లేఅవుట్లను చెడగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది అట్టి ఇండ్లను ఇండ్ల స్థలాల పట్టాలు ఉన్న పేదలకు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీ ఎన్నికలలో అచ్చంపేట పట్టణంలో ఉన్న ఇండ్లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు అట్టి హామీని నిలబెట్టుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు కార్యక్రమంలో మహమ్మదా బేగం సల్మా బేగం ఉమ్రా బేగం నసరీన్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.