అటవీభూమలు రక్షణకు చర్యలు
మెదక్,జనవరి31(జనంసాక్షి): రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణీల్లో నమోదు చేయకూడదని కలెక్టర్ ధర్మారెడ్డి తహసీల్దార్లతో అన్నారు. రైతులు సాగు మాత్రమే అటవీ శాఖ నుంచి పట్టాలను అందించడం జరిగిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూముల విస్తీర్ణం సరిపడా ఉందాలేదో అనే విషయాన్ని సర్వే ద్వారా నిర్దారించుకోవాలన్నారు. అలాగే ప్రతి మండలంలో ఉన్న అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని రకాల చర్యలు చేట్టాలన్నారు. సర్వే అవసరం ఉన్నచోట రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కేటాయించిన భూములను రెవెన్యూ పహాణీలలో నమోదు చేయకూడదని సూచించారు. అన్ని శాఖల సహకారంతో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అటవీ భూములు అక్రమణలు కాకుండా కందకాలను తీయడం జరిగిందన్నారు. అడవులను సంరక్షించేందుకు , అభివృద్ధి చేసేందుకు గాను జంగల్ బచా వో… జంగల్ బడావో అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రెండు శాఖల సర్వే నిర్వహించి అటవీ భూములను నిర్దారించాలన్నారు. అడవులను సంరక్షించేందుకు ,అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవమారించాల్సిన అవసరం ఉందన్నారు.