అటవీ అధికారులపై న్యూడెమోక్రసీ నేతల దాడి
ఖమ్మం, ఆగస్టు 09: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులుపై కొందరు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఇల్లందు డివిజన్లో చోటుచేసుకుంది. డివిజన్లోని పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులు, కూలీలపై న్యూడెమోక్రసీ నేతల దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి ఇల్లందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి ప్రాంతాల్లో పలువురు న్యూడెమోక్రసీ నేతలను అరెస్ట్ చేశారు.