అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి గ్రూపు రాజకీయాలు చేయడం తగదు తూప్రాన్
జనం సాక్షి నవంబర్ 15:: రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ ప్రతాపరెడ్డి ఒక అతిథిగా తూప్రాన్ కు రావాలని ఇక్కడ వచ్చి గ్రూపు రాజకీయాలు చేయడం అవసరం లేదని నీవు కేసీఆర్ కు ఓటు వేయలేదని ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం లేదని తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ ఉద్యమకారులు శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లను అండదండలతో ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో తూప్రాన్ లో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు శ్రీనివాస్ ఇలాగే వ్యవహరిస్తే తాము ఎదురు దాడి చేయక తప్పదు అన్నారు ప్రతాప్ రెడ్డి తూప్రాన్ కి వచ్చి కళ్యాణ లక్ష్మి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం లేదన్నారు ఇలాగే వ్యవహరిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో నీకు చోటు లేకుండా చేస్తామని హెచ్చరించారు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన ప్రతాప్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు కౌన్సిలర్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటాయని వాటిని సరిదిద్దాల్సిన నీవే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు భూకబ్జాదారులు రౌడీ షీట్లను మట్టి మాఫియా వారిని వెంట వేసుకొని రాజకీయం చేయడం తగదన్నారు శ్రీనివాస్ ఉపసర్పంచిగా ఏమీ అభివృద్ధి చేయలేదని గ్రూపు రాజకీయ నడిపించడంలో ఆయన వైస్ చైర్మన్ గా ఎన్నికైనప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదని ముఠా రాజకీయాలు చేస్తున్నాడని అతని అవినీతిపై కరపత్రాలు వేయడానికి తామసిద్దమన్నారు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ ముఠాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి గ్రూప్ విభేదాలు చేయడం ఒక వర్గానికి కొమ్ము కాయడం అబద్దాలు చెప్పడం స్వార్థ రాజకీయాలు చేయడం తగదని సమస్యను పరిష్కరించడానికి అన్ని వర్గాలను కూర్చోబెట్టి సమస్యను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు వెంకట్ గౌడ్ మల్లేశం దుర్గారెడ్డి సత్య లింగం మామిడి వెంకటేష్ రాజు మైనార్టీ నాయకులు సత్తార్ నాయకులు నర్సింగరావు జనార్దన్ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు