అటవీ శాఖ అధికారుల దాడులను ప్రతిఘటించాలి
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను రైతులు ఐక్యంగా ప్రతిఘటించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం ఏర్పాటయిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా పోడు భూములు సేద్యం చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు, /-పర్జన్యాలు మానుకోవాలని కోరారు. పరిశ్రమలకు, బడా పెట్టుబడిదారులకు వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడుభూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.