అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ కరపత్రాలను విడుదల
గంగారం అక్టోబర్ 16 (జనం సాక్షి)
అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ పాకాల కొత్తగూడ
లో సదస్సు కరపత్రాలను విడుదల చేసిన అఖిలభారత రైతు కూలి సంఘం.ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్. రాష్ట్ర నాయకులు పుల్లన్న.
మహబూబాద్ జిల్లా అధ్యక్షులు పెనక.వెంకన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్న అటవీ సంరక్షణ నియమాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనవి. 40 కోట్ల మంది ప్రజల భూములను ఆస్తులను కోల్పోతారు.
2022 చట్టం ద్వారా ఆదివాసి జీవితాలను విధ్వంసానికి గురి చేసి అడవి ని అడవి సంపదను వారి సాంప్రదాయాలను. ప్రజలకు లభించిన హక్కులకు గ్రామసభల అనుమతి లేకుండా పిసా చట్టం వన్ ఆఫ్ సెవెన్ చట్టం దుర్వినియోగపరుస్తూ పోడు భూములకు చట్టబద్ధ హక్కులు రద్దయి. ప్రభుత్వ దయాదాక్షిణాలపై ఆధారపడవలసి వస్తుంది. సూటిగా చెప్పాలంటే 2006 అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం అవుతుంది. మోడీ తెస్తున్న అడవి నియమాలు ఆదివాసి హక్కులను దెబ్బతీస్తున్నాయి.
దేశంలో నక్సల్బరీ. శ్రీకాకుళం. గోదావరిలో పోరాటాల ఫలితంగా వచ్చిన అనేక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు.
అడవి ఆదివాసులది దానిపై పూర్తి హక్కు ఆదివాసులదే సర్వధికారులు ఆదివాసులకే చెందుతాయి. తమ నేల మీదనే తమరిని పరాయి వాలుగా చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రాలను. అఖిలభారత రైతుకూలీ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
కొమరం భీమ్ ..బిర్సా ముండా. సమ్మక్క. సారక్క. కోటన్న. కొండన్న. బాటన్న. లింగన్న. మురళి. ముత్తన్న. గణేష్. యాకన్న. బూర్కా వెంకటయ్య వాసం పాపన్న. వీరబోయిన ముత్తన్న. పూణెం లక్ష్మీనారాయణ ఇలాంటి ఎందరో ఆదివాసి వీరులు జల్ జంగిల్ జమీన్ పేరుతో తమ హక్కుల సాధన కోసం పోరాడి అమరత్వం చెందారు. వారి ఆశయాల బాటలో మన హక్కుల రక్షణ కోసం పోరాడుదాం. మన హక్కుల పై జరిగే దాడులకు వ్యతిరేకంగా ఈనెల 29న(29-10-2022) నాడు పాకాల కొత్తగూడ సెంటర్లో జరిగే సదస్సును విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి సక్రు జిల్లా.నాయకులు సిద్ధబోయిన జీవన్. సాంబరాజు. చేరాలు. పడిగ శ్రీను. తదితరులు పాల్గొన్నారు.