అటు ఏరువాక..ఇటు హరితహారం
మెదక్,జూన్11(జనం సాక్షి): రైతులు వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న పలువురు రైతులు ఇప్పటికే నారు పోసి నాట్లకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకుగానూ వ్యవసాయశాఖ విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. వివిధ పంటలు వేసే వారికోసం అవసరమైన విత్తనాలు సిద్దం చేశారు. విత్తనాలు సహకార సంఘం, రైతు అగ్రోస్‌తో పాటు పలు దుకాణాలలో కొనుగోళ్లకు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాలు ప్రారంభం కానుండడంతో మూడో విడత హరితహారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి కూడా లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని దృఢ నిశ్చయంతో ఉన్న సోషల్ ఫారెస్ట్, ఈజీఎస్ శాఖల అధికారులు నర్సరీల్లో మొక్కలను పరిశీలిస్తున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో లో పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో లక్షలాది మొక్కలు నాటారు. నర్సరీలో పండ్ల మొక్కలు, టేకు మొక్కలను పెంచుతున్నారు. వీటిని జులైలో గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఈ సంవత్సరం లక్ష్యం మించిపోయే విధంగా మొక్కల ను నాటాలని సోషల్ ఫారెస్ట్, ఈజీఎస్ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. హరితహారాన్ని ఒక మ¬త్తర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి మొక్కలు నాటించి ఈజీఎస్ కూలీల ద్వారా నాటిన మొక్కల చుట్టు రక్షణ కంచెలు సైతం ఏర్పాటు చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. వన విభాగం కింద ఒకటి, జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ఆధ్వర్యంలో రెండు నర్సరీలను నెలకొల్పి మొక్కల పెంపకం చేపట్టారు. ఈ నర్సరీల్లో పండ్ల విభాగంలో జామ, ఉసిరి, నిమ్మ, బొప్పాయి, కర్జూరా, ఫ్లవరింగ్, సాధారణ మొక్కలు కానుగ, చింత, ఈత, నీలగిరి, టేకు, కుకుండు, వెదురు, వంటి మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు ఎక్కడ ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నర్సరీలను రెండు రోజులకోమారు పరిశీలిస్తూ, నిర్వాహకులకు కావాలసిన తోడ్పాటు, సలహా, సూచనలు ఇస్తున్నాంరు. జూన్, జులైలో వర్షాలు కురవగానే అన్ని గ్రామాల్లో మొక్కలు నాటిస్తాం.