అటెంప్ట్ మర్డర్ కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష 1000/- రూపాయల జరిమానా

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 22 (జనం సాక్షి); పాత గొడవలను మనసులో పెట్టుకోని ఒక వ్యక్తినీ ట్రాక్టర్ తో టాక్కర్ ఇచ్చి ఎరుకలి కొడవలి తో దాడి చేసిన కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1000/- రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి గద్వాల జి. ప్రభాకర్ గారు మంగళవారము తీర్పును వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం , షాబాద గ్రామానికి చెందిన దేవకుమార్ అనువ్యక్తి గ్రామం లో తన పెద్ద నాన్న అయిన పసునూరు భాస్కర్ కిరణం దగ్గర ఉండగ అదే గ్రామానికి చెందిన పసునూరు నాగరాజు అను వ్యక్తి పాత గొడవలను మనసులో పెట్టుకొని ట్రాక్టర్ తో తనను చంపాలనే ఉద్ద్యేశం తో టాక్కర్ ఇచ్చి వెంట తెచ్చుకున్న కొడవలి తో తన ఎడమ చెంప, ఎడమ భుజం పై దాడి చేయగా రక్త గాయం అయినది అని, తాను తప్పించుకునే ప్రయత్నం లో ఎరుకలి కొడవలి పట్టుకొనగ ఎడమ చేతికి రక్త గాయం ఐనదని అక్కడే ఉన్న తన పెద్దనాన్న పసునూరు భాస్కర్, గ్రామస్థులు వచ్చి అతడి నుండి నన్ను కాపాడినారు అనీ తన ను చంపాలనే ఉద్ధ్యేశం తో తన పై దాడి చేసిన నాగరాజు పై చర్యలు తీసుకోవాలని మే 3వ తేదీ 2021 న పిర్యాదు ఇవ్వగా వారి పిర్యాదు మేరకు ఇటిక్యాల పోలీస్ లు క్రైమ్ కేసు నమోదు చేసుకొని అనంతరము విచారణ చేపట్టిన అప్పటి ఇటిక్యాల ఎస్సై జి.వి.సత్యనారాయణ నిందితుడు పి.నాగరాజు ట్రాక్టర్ తో పిర్యాదు దేవ కుమార్ కు టక్కర్ ఇచ్చి ఎరుకలి కొడవలి తో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశానుసారం కోర్టులో కేసు ట్రయల్ సమయంలో గద్వాల్ డి. ఎస్పి పి. వెంకటేశ్వర్లు, ఆలంపూర్ సి. ఐ రాజు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.ఆరోజు నుండి ఈరోజు వరకు అడిషనల్ సీనియర్ సివిల్ సెషన్స్ కోర్టు గద్వాల లో కేసు విచారణ జరిగింది. మంగళవారం అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి గద్వాల జి. ప్రభాకర్ ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుడి పై నేరం రుజువైనoదున నిందితుడు పసునూరు నాగరాజు కు 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000/- రూపాయాల జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారు.నేరస్థులకు జైలు శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్రాములు, కోర్టు కానిస్టేబుళ్లు రాఘవేంద్ర, కోర్టు లైజనింగ్ లక్ష్మణ్ సహకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి అప్పటి ఇటిక్యాల ఎస్సై జి. వి సత్యనారాయణ ని, ప్రస్తుత ఎస్సై అశోక్ బాబు ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్రాములు ను, కోర్టు కానిస్టేబుల్ రాఘవేంద్ర కోర్టు లైజనింగ్ లక్ష్మణ్ ను జిల్లా ఎస్పీ అభినందించారు.