అట్టుడికిన కరీంనగర్

 

* జిల్లాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనాలు

* బండి యాత్రతో కెసిఆర్ పునాదులు కదులుతున్నాయ్

 

* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టుపై కరీంనగర్ బీజేపీ శ్రేణులు బగ్గుమన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి కెసిఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ సమీపంలో నల్ల బ్యాడ్జీలను ధరించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తో కెసిఆర్ కు వణుకు మొదలైం దన్నారు. శాంతియుతంగా , ప్రజాస్వామ్య పద్ధతిలో మూడు విడతలుగా విజయవంతంగా కొనసాగుతున్న బండి సంజయ్ సంగ్రామ పాదయాత్ర కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడితే , టిఆర్ఎస్ ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయని, అందుకే యాత్రను అడ్డుకొని బండి సంజయ్ ని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని తెలిపారు . కేసీఆర్ ప్రభుత్వం లాఠీలతో తూటాలతో ప్రజా సంగ్రామ యాత్ర ఉద్యమాన్ని ఆపలేరన్నారు. బిజెపి రోజురోజుకు ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు .కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియాలో ఉన్న ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి , ప్రజల దృష్టిని మరల్చడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అవస్థలు పడుతుందని ఎద్దేవా చేశారు . కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని, ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే విధంగా చేయడం దుర్మార్గమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పై, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదని , అందుకే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఎజెండాను అమలు చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కి రాజ్యమేలాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని , అక్రమ అరెస్టులు కేసులకు బిజెపి శ్రేణులు భయపడరని , రాబోయే రోజుల్లో బిజెపి శక్తి ఏమిటో కేసీఆర్ సర్కార్కు తెలియజేసేలా చేసి తగిన గుణపాఠం చెప్తామని ఆయనఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్రెడ్డి, మాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శులు బింగి కరుణాకర్, రంగు భాస్కరాచారి, రాపర్తి ప్రసాద్, మాడుగుల ప్రవీణ్, కటకంలోకేష్ వైదరామానుజం, బండ రమణారెడ్డి, ఎండి ముజీబ్, దుర్శెట్టి సంపత్, బల్బీర్ సింగ్, పుప్పాల రఘు, జిల్లా అధికార ప్రతినిధులు కార్పొరేటర్లు అనూప్, నరహరి లక్ష్మారెడ్డి, మాడిశెట్టి సంతోష్, పాదం శివరాజ్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, జీడిమల్లేష్, రామిడిఆదిరెడ్డి ,సుగుర్తి జగన్, కందుల శ్రీనివాసరెడ్డి నాంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.