అడవులను దెబ్బతీసే కుట్రలు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అడవులను కూడా కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావ్‌ ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే కుట్రలను సహించబోమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నూతన అటవీ పరిరక్షణ విధానం కొత్త చట్టం తీసుకు వచ్చి అడవిని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే యత్నాలను అడ్డుకుంటామని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను, పెసా గ్రామసభ, పర్యావరణ, వన్యప్రాణుల చట్టం మొత్తం తుంగలో తొక్కి కార్పొరేట్‌లకు అడవిని అప్పజెప్పే విధంగా రూల్స్‌ తీసుకు రావడానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వ్యతిరేకిస్తోదన్నారు. దీనిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోడుభూములకు తక్షణం పట్టాలు ఇవ్వాలని, గిరిజనులను మోసం విధానాలను వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.