అడవుల్లో మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ
వరద ఉధృతి తగ్గాక కార్యాచరణ

ఆదిలాబాద్‌,జూలై15(జనంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో కనీసం 40 నుంచి 50 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు. భారీగా వర్షాలు పడడంతో మొక్కల పెంపకానికి అనువుగా మారిందిన అఠవీ అధికారులు అన్నారు. వరదనుంచి కోలుకున్న తరవాత మొక్కల పెంపకంపై దృష్టి పెడతామని అన్నారు. అటవీ ప్రాంతాల్లోని పలుచగా ఉన్న చోట 24.53 లక్షలు, ఇతర ప్రాంతాల్లో లక్ష మొక్కలను నాటేందుకు అటవీశాఖ అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తోండడంతో అధికారుల నాలుగో విడ త హరితహారానికి సిద్ధమయ్యారు. ఈ విడతలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కోటి మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 34 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా
ఎంచుకోగా పలు ప్రభుత్వ శాఖలకు సైతం లక్ష్యాలని నిర్దేశిరచారు. జిల్లాలో ఈ యేడు కూడా హరితహారంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించగా ఇందుకు అవసరమైన మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 58 నర్సరీల్లో వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి డీఆర్‌డీవో, మున్సిపల్‌, ఐటీడీఏ ఆధ్వర్యంలో సైతం వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ విడతలో మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను ముందుగానే గుర్తించిన అధికారులు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు నాటాలనే వాటిని గు ర్తించి వాటిని నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రజలు ఇండ్లలో పెంచుకునేందుకు అవసరమైన మొక్కలను సైతం నర్సరీల్లో పెంచారు. అయితే వర్షాలకు చాలాచోట్ల కొట్టుకుని పోయాయని భావిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 34 లక్షల మొక్కలను నాటనున్నారు. గ్రామాల్లోని వివిధ ప్రాం తాల్లో 15 లక్షల టేకు, 8లక్షల సీతాఫల్‌, మలబార్‌, వేప, 5 లక్షల కల్పేతర మొక్కలు, ప్రతి ఇంటికి 6 మొక్కల చొ ప్పున 6 లక్షల వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 లక్షల మొక్కలు, వ్యవసాయశాఖచే రైతులు భూముల్లో 5 లక్షలు, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో లక్ష, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 2 వేల గ్రామాల్లో 4.86 లక్షలు, పోలీస్‌ శాఖ
ఆధ్వర్యంలో లక్ష, నీటిపారుదల శాఖ ఆ ధ్వర్యంలో 45 వేల నాటేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. ఇతర ప్రభుత్వశాఖలైన పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం, విద్యాశాఖ, మార్కెటింగ్‌, ఎస్సీ కార్పొరేషన్‌, దేవాదాయ శాఖ, మైనార్టీ, ఆర్టీ సీ, విద్యుత్‌, పరిశ్రమలు, పశు సంవర్థక, మహిళా శిశు సంక్షేమం, వైద్య శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నారు.