అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్సీపట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాలాల మండలం జుంటుపల్లిలో పలువురు అతిసారకు గురై తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్నతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఆరోగ్యంగా కోలుకునేలా మెరుగైన  వైద్యం అందించాలని సూపర్డంట్ కు ఫోన్ లో మాట్లాడారు. జుంటుపల్లి లో పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జుంటుపల్లి సర్పంచ్ తో కలసి తాండూర్ ప్రభుత్వ హాస్పటల్లో పర్యించారు, వారి వెంట కౌన్సిలర్స్ నర్సింహులు, నీరజ బల్ రెడ్డి, పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్సుద్, అరవింద్ రెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి బి రఘు, అశోక్ ముదిరాజ్,వైద్యులు తదితరులు ఉన్నారు.
Attachments area