అత్తారింటికి అల్లు అర్జున్

నల్లగొండ, అక్టోబర్ 23 : స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ చింతపల్లికి వచ్చాడు. తెలంగాణ అల్లుడైన బన్నీ దసరా పండుగ కోసం పెద్దవూరు మండలం చింతపల్లిలోని అత్తారింటికి వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చాడనే వార్తతో అక్కడికి భారీగా గ్రామస్తులు, అభిమానులు చేరుకున్నారు. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా ఆకట్టుకున్న అల్లు అర్జున్ తన డైలాగ్స్‌తో అందరినీ అలరించారు.