అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు – రాయపర్తి ఎస్సై విజయ్ కుమార్
రాయపర్తి,జులై19(జనంసాక్షి):మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఇళ్లల్లో నుండి ఎవరు బయటకు రావద్దని,అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని,పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని,చెరువులు,బావులు,వాగులు,కాలువల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు,గోడలు,చెట్లకు దగ్గరగా వెళ్లరాదని,కరెంట్ స్తంభాలు,ట్రాన్స్ ఫార్మర్ లను తాకరాదని వాహనాలు నెమ్మదిగా,జాగ్రత్తగా నడపాలని రాయపర్తి మండలం ఎస్సై విజయ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.