అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయండి*

అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయండి*
-జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, జూన్ 6 (జనం సాక్షి);
సోమవారము  నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 10 ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ సందర్భంగా పిర్యాదుదారులతో  నేరుగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విన్న జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై  వెంటనే స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు, ఎస్సై లకు సూచించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా పిర్యాదు దారులకు సూచించారు.
సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ,  సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీల పేరుతో గాని ,ఇతర పేర్లతో గాని ఫ్రీ గా ఏవైనా వస్తువులు ఇస్తామని మీ ఫోన్ లకు వచ్చే మెస్సేజ్ లను  ప్రజలు నమ్మవద్దు అని అన్నారు. ఫోన్ లకు వచ్చే అనుమానాస్పదంగా కనిపించే బ్లూ లింక్ లను ఓపెన్  చేయవద్దు అని,లాట్రీ  తాకిందనో, బహుమతి గెలుచుకున్నారనో లేదా డబ్బులు రేటింపు అవుతాయనో వచ్చే మెస్సేజ్ లను ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా మోసపోయామని గ్రహిస్తే వెంటనే 24 గంటల లోపు సైబర్ క్రైమ్ జాతీయ హెల్ప్ లైన్ నెం- 1930  కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. పిర్యాదు చేసే సమయం లో ఫోన్ నెం తో పాటు ఖాతా నెం, బ్యాంక్ పేరు, వాలెట్ పేరు, అకౌంట్ నెం,యు పి ఐ డి నెంబర్లు మొదలైన వివరాలు ఇవ్వాలని అన్నారు.  అలాగే అత్యవసర సమయంలో డయల్ 100కు  కాల్ చేసి పోలీసువారికి సమాచారం అందించడం ద్వారా పోలీస్ వారు క్షణాలలో అక్కడకు చేరుకుని రక్షణ కల్పించడం జరుగుతుందని   జిల్లా ఎస్పీ తెలిపారు.