అత్యాచారం ఘటనలో నిందితుడి వూహాచిత్రం విడుదల
ముంబయి: విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అనుమానితుడి వూహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాంద్రాలో ఉంటున్న ఓ స్పానిష్ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం విలువైన వస్తువులను తీసుకొని పారిపోయాడని స్పానిష్ జాతీయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలతో వూహా చిత్రాన్ని రూపొందించి నిందితుని కోసం గాలింపు చేపట్టారు.